IPL 2023 : సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాతి కెప్టెన్ అతడేనా? రేసులో చాలా మందే ఉన్నా అతడివైపే మొగ్గు చూపే అవకాశం!
IPL 2023 : సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాతి కెప్టెన్ అతడేనా? రేసులో చాలా మందే ఉన్నా అతడివైపే మొగ్గు చూపే అవకాశం!
IPL 2023 Mini Auction: సరిగ్గా 10 నెలల తర్వాత ఐపీఎల్ 2023 కోసం డిసెంబర్ 23న మినీ వేలం జరగనుంది. మెగా వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్లు జట్టుకు భారంగా తయారైతే వారిని వదులుకునే అవకాశాన్ని బీసీసీఐ ఫ్రాంచైజీలకు ఇచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 వేడి అప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఆరంభమయ్యే ఈ ధనాధన్ లీగ్ కు తొలి అడుగుపడింది. ఈ ఏడాది ఆరంభంలో మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే.
2/ 8
సరిగ్గా 10 నెలల తర్వాత ఐపీఎల్ 2023 కోసం డిసెంబర్ 23న మినీ వేలం జరగనుంది. మెగా వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్లు జట్టుకు భారంగా తయారైతే వారిని వదులుకునే అవకాశాన్ని బీసీసీఐ ఫ్రాంచైజీలకు ఇచ్చింది.
3/ 8
ఈ క్రమంలో దీనికి 15వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించగా.. 10 జట్లు కూడా తమకు భారంగా ఉన్న ప్లేయర్లను వదిలేసుకుంది. కేకేఆర్ అత్యధికంగా ప్లేయర్లను విడుదల చేయగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఏకంగా 12 మందిని విడుదల చేసింది.
4/ 8
వీరిలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో పాటు నికోలస్ పూరన్.. ముచ్చటపడి కొనుగోలు చేసిన రొమారియో షెపర్డ్ లు కూడా ఉండటం విశేషం. కేన్ మామ.. పూరన్ లను జట్టు నుంచి సాగనంపడంతో సన్ రైజర్స్ తరువాతి కెప్టెన్ ఎవరంటూ అభిమానులు చెవులు కొరక్కుంటున్నారు.
5/ 8
సన్ రైజర్స్ తర్వాతి కెప్టెన్ గురించి ఇప్పుడే మాట్లాడటం అవివేకమే అవుతుంది. డిసెంబర్ 23న మినీ వేలం జరగనుంది. అందులో ప్రతి జట్టు కూడా మళ్లీ ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది.
6/ 8
అయితే కెప్టెన్సీ రేసులో ప్రముఖంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా సౌతాఫ్రికా ప్లేయర్ మార్కరమ్ పేరు. గత కొంత కాలంగా అతడు నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
7/ 8
దాంతో అతడికే సన్ రైజర్స్ పగ్గాలు అప్పజెప్పాలని సన్ రైజర్స్ యోచిస్తున్నట్లు సమాచారం. మార్కరమ్ తో పాటు రాహుల్ త్రిపాఠి, భువనేశ్వర్ కుమార్ లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు సమచారం.
8/ 8
బెన్ స్టోక్స్ రూపంలో మినీ వేలంలో కీలక ప్లేయర్ అందుబాటులోకి రానున్నాడు. ఇతడిని సన్ రైజర్స్ కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.