అయితే సీజన్ మొదలయ్యాక టెస్టు తరహా బ్యాటింగ్ తో సన్ రైజర్స్ అభిమానుల సహనాన్ని పరీక్షించాడు. ఇక కెప్టెన్ గా కూడా దారుణంగా విఫలం అయ్యాడు. 13 మ్యాచ్ ల్లో 216 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రయిక్ రేట్ 93. ప్రస్తుతం విలియమ్సన్ ఫామ్ లో కూడా లేడు. దాంతో ఇతడిని సన్ రైజర్స్ వదిలించుకునే అవకాశం ఉంది.