ఇక ఇటీవలె ముగిసిన టి20 ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన స్యామ్ కరణ్ కోసం కూడా ముంబై పోటీ పడనుంది. టి20 ప్రపంచకప్ లో కరణ్ 13 వికెట్లు తీశాడు. అవసరం అయితే బ్యాట్ తో కూడా మెరుపులు మెరిపించగలడు. అయితే కరణ్ కోసం చైన్నై సూపర్ కింగ్స్ కూడా పోటీ పడే అవకాశం ఉంది. గతంలో అతడు చైన్నై తరఫున ఆడిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ముగ్గురి కోసం ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కరణ్, గ్రీన్ ల కోసం భారీ మొత్తం చెల్లించేందుకు సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ రెడీగా ఉన్నాయి. ఈ రెండు జట్ల దగ్గరే అత్యధిక మనీ పర్సు ఉంది. ముంబై దగ్గర కేవలం రూ. 20.55 కోట్లు మాత్రమే ఉంది. తక్కువ డబ్బు ఉండటంతో ఈ ముగ్గురిని సొంతం చేసుకోవడంలో ముంబై జట్టుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.