రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ల అనుభవం పెద్ద అండ. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి వస్తే లీగ్ లోనే అత్యంత బలమైన జట్టుగా ముంబై మారడం ఖాయం. ట్రేడ్ పద్దతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి జేసన్ బెహ్రాన్ డార్ఫ్ ను తీసుకుంది. డిసెంబర్ నెలలో జరిగే మినీ వేలంలో ముంబై గరిష్టంగా 9 మందిని కొనుగులు చేసే అవకాశం ఉంది. ఇందులో ఆరుగురు భారతీయులను ముగ్గురు విదేశీయులను తీసుకునే అవకాశం ఉంది. ముంబై దగ్గర రూ. 20.55 కోట్ల మనీ పర్సు ఉంది.