Mumbai Indians : సన్ రైజర్స్ చేయలేని పని ముంబై ఇండియన్స్ చేసింది.. అందుకే ఇప్పుడు సంతోషంగా ఉంది..
Mumbai Indians : సన్ రైజర్స్ చేయలేని పని ముంబై ఇండియన్స్ చేసింది.. అందుకే ఇప్పుడు సంతోషంగా ఉంది..
Mumbai Indians : ఆరంభంలో తిలక్ వర్మ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వేలం పాడింది. అయితే రూ. 50 లక్షల మార్కు దాటగానే పోటీ నుంచి సన్ రైజర్స్ తప్పుకుంది. ఇక అదే సమయంలో చైన్నైతో తీవ్రంగా పోటీ పడ్డ ముంబై ఇండియన్స్ చివరకు కోటి 70 లక్షలకు సొంతం చేసుకుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐపీఎల్ (IPL) మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ యువ ప్లేయర్ తిలక్ వర్మ (Tilak Verma) వేలంలోకి రాగా.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) రూ. 1.7 కోట్లకు సొంతం చేసుకుంది.
2/ 8
ఆరంభంలో తిలక్ వర్మ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వేలం పాడింది. అయితే రూ. 50 లక్షల మార్కు దాటగానే పోటీ నుంచి సన్ రైజర్స్ తప్పుకుంది. ఇక అదే సమయంలో చైన్నైతో తీవ్రంగా పోటీ పడ్డ ముంబై ఇండియన్స్ చివరకు కోటి 70 లక్షలకు సొంతం చేసుకుంది.
3/ 8
ఇక తొలి సీజన్ లో ముంబై పేలవంగా ఆడినప్పటికీ తిలక్ వర్మ మాత్రం అదరగొట్టాడు. సీజన్ లో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అంటూ టీమిండియా సారథి రోహిత్ శర్మతో కితాబు అందుకున్నాడు.
4/ 8
2023 ఐపీఎల్ కోసం తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రీటెయిన్ చేసుకుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే వన్డే టోర్నీలో తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. తాజాగా మణిపూర్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో ప్రదర్శించాడు.
5/ 8
తొలుత బౌలింగ్ లో 2 వికెట్లు తీసిన అతడు.. ఆ తర్వాత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్ కు వచ్చి అజేయ శతకం బాది జట్టును గెలిపించాడు. తొలుత మణిపూర్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది.
6/ 8
అనంతరం ఛేదనలో హైదరాబాద్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన తిలక్ వర్మ 77 బంతుల్లోనే 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండటం విశేషం.
7/ 8
రోహిత్ రాయుడు (39)తో కలిసి అజేయమైన నాలుగో వికెట్ కు164 పరుగులను తిలక్ వర్మ జోడించాడు. తిలక్ వర్మ తాజా ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ ఫుల్ ఖుషీ ఖుషీగా ఉంది.
8/ 8
ఇక ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనుంది. ఈ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా 42 కోట్ల రూపాయలతో వేలంలో పాల్గొననుంది.