IPL 2023 Mini Auction : రాహుల్ కెప్టెన్సీ ఊడనుందా? లక్నో తర్వాతి కెప్టెన్ అతడేనా?
IPL 2023 Mini Auction : రాహుల్ కెప్టెన్సీ ఊడనుందా? లక్నో తర్వాతి కెప్టెన్ అతడేనా?
IPL 2023 Mini Auction : తొలి సీజనే అయినా ఈ ఏడాది ఐపీఎల్ లో ఈ రెండు జట్లు కూడా అదరగొట్టాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ చాంపియన్ గా నిలిస్తే.. రాహుల్ కెప్టెన్సీలోని లక్నో ప్లే ఆఫ్స్ వరకు చేరుకుంది.
ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Gaints) రూపంలో రెండు జట్లు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
2/ 8
తొలి సీజనే అయినా ఈ ఏడాది ఐపీఎల్ లో ఈ రెండు జట్లు కూడా అదరగొట్టాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ చాంపియన్ గా నిలిస్తే.. రాహుల్ కెప్టెన్సీలోని లక్నో ప్లే ఆఫ్స్ వరకు చేరుకుంది.
3/ 8
గుజరాత్ ను చాంపియన్ గా నిలబెట్టిన హార్దిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. టి20లకు అతడిని కెప్టెన్ గా జనవరిలో ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
4/ 8
వాస్తవానికి ఈ అవకాశం రాహుల్ కు రావాలి. ఎందుకంటే హార్దిక్ కంటే కూడా ముందు రాహుల్ టీమిండియాకు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే నిలకడలేని ఆటతీరుతో రాహుల్ ఆ అవకాశాన్ని దూరం చేసుకున్నాడు.
5/ 8
ఇక తాజాగా రాహుల్ లక్నో కెప్టెన్సీ కూడా డేంజర్ లో పడింది. డిసెంబర్ 23న జరిగే మినీ వేలంలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ను సొంతం చేసుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది.
6/ 8
ప్రస్తుతం లక్నో దగ్గర రూ. 22 కోట్ల రూపాయలు పర్సు మిగిలి ఉంది. వేలంలో లక్నో కనీసం నలుగురు ప్లేయర్లను సొంతం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ కోసం భారీ ధరను వెచ్చించేందుకు లక్నో సిద్ధమైనట్లు తెలుస్తుంది.
7/ 8
బెన్ స్టోక్స్ ను సొంతం చేసుకున్నంత మాత్రాన రాహుల్ కెప్టెన్సీకి వెంటనే వచ్చే ప్రమాదం ఏం ఉండదు. అయితే సీజన్ సాగే కొద్ది అతడి వ్యక్తిగత ఫామ్ తో పాటు కెప్టెన్సీ పేలవంగా ఉంటే మాత్రం బెన్ స్టోక్స్ ను కెప్టెన్ గా చేసే అవకాశం ఉంటుంది.
8/ 8
కొచ్చి వేదికగా డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఇందు కోసం 991 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో బెన్ స్టోక్స్ తో పాటు స్యామ్ కరణ్, కామెరూన్ గ్రీన్ లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు.