IPL 2023 Mini Auction : హాట్ స్టార్ లో నో లైవ్.. ఐపీఎల్ మినీ ఆక్షన్ ను ఎక్కడ చూడాలంటే?
IPL 2023 Mini Auction : హాట్ స్టార్ లో నో లైవ్.. ఐపీఎల్ మినీ ఆక్షన్ ను ఎక్కడ చూడాలంటే?
IPL 2023 Mini Auction : ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలను కలుపుకుని 87 స్లాట్ లు ఖాళీగా ఉన్నాయి. అంటే డిసెంబర్ 23న జరిగే వేలంలో 405 మంది ప్లేయర్లలో గరిష్టంగా కేవలం 87 మందిని మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ వేడి అప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఈ ధనాధన్ లీగ్ కోసం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా మినీ వేలం జరగనుంది.
2/ 8
405 మంది ప్లేయర్లు ఈ వేలంలో తమ లక్ ను పరీక్షించుకోనున్నారు. ఇందులో 273 మంది భారత ప్లేయర్లు కాగా.. 132 మంది విదేశీయులు. మొత్తం 991 మంది ప్లేయర్లు మినీ వేలం కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఫ్రాంచైజీలు వారి సంఖ్యను 405కు తగ్గించింది.
3/ 8
ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలను కలుపుకుని 87 స్లాట్ లు ఖాళీగా ఉన్నాయి. అంటే డిసెంబర్ 23న జరిగే వేలంలో 405 మంది ప్లేయర్లలో గరిష్టంగా కేవలం 87 మందిని మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
4/ 8
ఇక ఈ మినీ వేలం డిసెంబర్ 23 (గురువారం) మధ్యాహ్నం 2.30 గంటలకు ఆరంభం కానుంది. అభిమానులు ఈ మినీ వేలాన్ని ఇంట్లో కూర్చొని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది.
5/ 8
టీవీల్లో చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ చానెల్ ద్వారా మినీ వేలాన్ని లైవ్ చూసేయవచ్చు. అయితే డిజిటల్ ప్రసారాలను మాత్రం ఈసారి హాట్ స్టార్ లైవ్ టెలికాస్ట్ చేయడం లేదు.
6/ 8
డిజిటల్ ప్లాట్ ఫామ్ జియో సినిమా ఈ మినీ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. జియో యూజర్లు ఒక్క రూపాయి చెల్లించకుండానే జియో సినిమాను డౌన్ లోడ్ చేసుకుని మినీ వేలాన్ని లైవ్ లో చూసే అవకాశం ఉంది.
7/ 8
ఫిఫా ప్రపంచకప్ 2022 డిజిటల్ ప్రసారాలను భారత్ లో జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేసింది. టీవీల్లో కంటే కూడా జియో సినిమా యాప్ ద్వారానే ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్ లను ఎక్కువ మంది భారతీయులు చూడటం విశేషం.
8/ 8
నెల రోజుల పాటు జరిగిన ఈ ఫుట్ బాల్ ప్రపంచకప్ మహా సంగ్రామాన్ని దాదాపు 11 కోట్లకు మందికి పైగా భారతీయులు జియో సినిమా ద్వారా వీక్షించారు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కూడా జియో సినిమాలోనే ప్రత్యక్ష ప్రసారం కానుంది.