IPL 2023 Mini Auction : ఎక్కడో కాలుతున్నట్లుంది ఈ బర్నల్ రాసుకో.. నోటి దూల కెప్టెన్ కు కౌంటర్ ఇచ్చిన జాఫర్
IPL 2023 Mini Auction : ఎక్కడో కాలుతున్నట్లుంది ఈ బర్నల్ రాసుకో.. నోటి దూల కెప్టెన్ కు కౌంటర్ ఇచ్చిన జాఫర్
IPL 2023 Mini Auction : ఇక 2023 సీజన్ కోసం తమ జట్టు బ్యాటింగ్ కోచ్ గా భారత మాజీ టెస్టు ఓపెనర్ వసీం జాఫర్ ను పంజాబ్ కంగ్స్ నియమించుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వ్యంగ్యంగా స్పందించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ కోసం డిసెంబర్ 23న బీసీసీఐ (BCCI) వేలం నిర్వహించనున్నా సంగతి తెలిసిందే. తమకు భారంగా ఉన్న ప్లేయర్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు వేలంలోకి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
2/ 8
ఇక 2023 సీజన్ కోసం తమ జట్టు బ్యాటింగ్ కోచ్ గా భారత మాజీ టెస్టు ఓపెనర్ వసీం జాఫర్ ను పంజాబ్ కంగ్స్ నియమించుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వ్యంగ్యంగా స్పందించాడు
3/ 8
‘తన చేతిలో అవుటైన వ్యక్తి బ్యాటింగ్ కోచ్ అంట’ అంటూ జాఫర్ ను తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. మైకేల్ వాన్ పార్ట్ టైమ్ బౌలర్.. తన లాంటి పార్ట్ టైమ్ బౌలర్ చేతిలో అవుటైన వ్యక్తి బ్యాటింగ్ కోచా అనే అర్థం వచ్చేట్లే ఉంది ఆ ట్వీట్. (PC : TWITTER Screen Grab)
4/ 8
అయితే దీనికి వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. మార్వెల్ సూపర్ హీరో హల్క్ బర్నల్ పట్టుకున్న ఫోటోను వాన్ ట్వీట్ కు రిప్లైగా ఇచ్చాడు. వాన్ నీకు ఎక్కడో కాలిపోతున్నట్లుంది ఈ బర్నల్ రాసుకో అని అర్థం వచ్చేలా ఆ ట్వీట్ ఉంది. (PC : TWITTER Screen Grab)
5/ 8
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొన్నేళ్లుగా జాఫర్, వాన్ ట్విట్టర్ వేదికగా వార్ జరుపుతున్న విషయం తెలిసిందే. ఒకరి కామెంట్స్ కు మరొకరు కౌంటర్ ఇచ్చేలా ట్వీట్స్ చేస్తున్నారు.
6/ 8
ఇక ఇటీవలె ముగిసిన టి20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ చాంపియన్ గా నిలిచిన తర్వాత వాన్ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. క్రికెట్ లో తామే కింగ్స్ అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నాడు.
7/ 8
అదే సమయంలో టీమిండియాను, బీసీసీఐపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాడు. తానే బీసీసీఐ బాస్ గా ఉంటే ఇంగ్లండ్ అనుసరిస్తున్న రొటేషన్ పద్దతిని ఫాలో అవుతానని పేర్కొన్నాడు. అంతేకాకుండా బీసీసీఐ పెద్దలకు అహంకారం ఉందంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు.
8/ 8
ఇక 2023లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచకప్ లో భారత్ ఫేవరెట్ అని ఎవరన్నా అంటే తాను ఒప్పుకోనని వ్యాఖ్యలు చేశాడు. ఇండియా వేదికగా టోర్నీ జరుగుతున్న టీమిండియా మాత్రం ఫేవరెట్ కాదని పేర్కొన్నాడు. ఇంగ్లండే ఫేవరెట్ అని గొప్పలకు పోయాడు.