IPL 2023 Auction : వేలంలో వీరిని కొంటే మిగిలేది బుగ్గే.. కావ్య మేడం మీకు అర్థం అవుతుందా?
IPL 2023 Auction : వేలంలో వీరిని కొంటే మిగిలేది బుగ్గే.. కావ్య మేడం మీకు అర్థం అవుతుందా?
IPL 2023 Auction : 991 మంది ప్లేయర్లు ఈ వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా భారత ప్లేయర్లు ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 కోసం మినీ వేలానికి రంగం సిద్ధమైంది. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న ఐపీఎల్ ఆక్షన్ జరగనుంది. ఇందుకోసం బీసీసీఐ (BCCI) ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది.
2/ 8
991 మంది ప్లేయర్లు ఈ వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా భారత ప్లేయర్లు ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉన్నారు.
3/ 8
బెన్ స్టోక్స్, స్యామ్ కరన్, కెమరూన్ గ్రీన్ లాంటి ప్లేయర్లకు ఈసారి వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. ఈ ముగ్గురితో పాటు సౌతాఫ్రికా ప్లేయర్లు రోసో, హెన్రిచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, ఆడమ్ జంపాలకు కూడా భారీ ధర పలికే ఛాన్స్ ఉంది.
4/ 8
అయితే కొందరు ప్లేయర్ల విషయంలో మాత్రం ఫ్రాంచైజీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలా ఉండకుండా ఎడా పెడా కొనుగోలు చేస్తే ఆ తర్వాత ఎందుకు కొన్నాం రా బాబు అని బాధ పడాల్సి ఉంటుంది.
5/ 8
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు వెనుక చూసుకోకుండా రొమారియో షెపర్డ్, నికోలస్ పూరన్ లాంటి ప్లేయర్లను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. తీరా సీజన్ లో వారు చేతులెత్తేస్తే ఏడాది కాకముందే వదిలించేసుకుంది.
6/ 8
ఈ నెలలో జరిగే మినీ వేలంలో విండీస్ ప్లేయర్లు రొమారియో షెపర్డ్, ఒడిన్ స్మిత్ ల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. వీరిద్దరితో పాటు కేన్ విలియమ్సన్, అజింక్యా రహానేలను కొనకుండా ఉంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
7/ 8
వీరితో పాటు శ్రీలంకకు చెందిన మ్యాథ్యూస్, కుశాల్ పెరీరాలను ఇంగ్లండ్ కు చెందిన తైముల్ మిల్స్, జో రూట్ లకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.
8/ 8
ఇక భారత ప్లేయర్ల విషయానికి వస్తే మనీశ్ పాండే, జైదేవ్ ఉనాద్కట్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్ లాంటి ప్లేయర్ల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేసినా అది వేస్ట్ ఖర్చే అంటూ కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వేలంలో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఇటువంటి ప్లేయర్లను కొనుగోలు చేయకుండా ఉంటేనే మంచిది.