IPL 2023 Mini Auction : ‘ఆ పాపం ఐపీఎల్ ది కాదు.. ఆటగాళ్లది’ టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ సంచలన కామెంట్స్
IPL 2023 Mini Auction : ‘ఆ పాపం ఐపీఎల్ ది కాదు.. ఆటగాళ్లది’ టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ సంచలన కామెంట్స్
IPL 2023 Mini Auction : ఇక ఇటీవలె ముగిసిన టి20 ప్రపంచకప్ లో కూడా భారత్ చేతులెత్తేసింది. సూపర్ 12లో అదరగొట్టిన భారత్ కీలకమైన సెమీస్ పోరులో పేలవ ప్రదర్శన చేసింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఐసీసీ (ICC) టోర్నీల్లో భారత్ (India) చెత్త ప్రదర్శన కనబరుస్తూ వస్తోంది. చివరిసారిగా 2013 చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్ గా నిలిచిన భారత్.. మళ్లీ ఐసీసీ ట్రోఫీని నెగ్గడంలో సఫలం కాలేదు.
2/ 8
ఇక ఇటీవలె ముగిసిన టి20 ప్రపంచకప్ లో కూడా భారత్ చేతులెత్తేసింది. సూపర్ 12లో అదరగొట్టిన భారత్ కీలకమైన సెమీస్ పోరులో పేలవ ప్రదర్శన చేసింది.
3/ 8
ఐసీసీ టోర్నీల్లో భారత్ సెమీఫైనల్లో ఓడటం ఇదేమి తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా భారత్ సెమీస్ లేదా ఫైనల్లో ఓడి రిక్త హస్తాలతో ఇంటిదారి పట్టింది.
4/ 8
ఇక ఐసీసీ టోర్నీల్లో భారత వైఫల్యాలకు ముఖ్య కారణంగా ఐపీఎల్ ను పేర్కొంటున్నారు అభిమానులు. అయితే ఇలాంటి వారికి టీమిండియా మాజీ ఓపెనర్.. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు
5/ 8
ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా విఫలమైన ప్రతిసారి కొందరు పనిగట్టుకుని ఐపీఎల్‌ను టార్గెట్ చేస్తున్నారని, ప్రపంచకప్ లలో విఫలమైతే ఆటగాళ్లను తిట్టాలి, వారి ప్రదర్శనపై మాట్లాడాలి కానీ, ఐపీఎల్‌పై ఆడిపోసుకోవడం ఏంటని విమర్శకులను నిలదీశాడు.
6/ 8
ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్.. ఐపీఎల్ ను కల్పవృక్షంతో పోలుస్తూ కామెంట్స్ చేశాడు. ప్రతి ఏడాది 2 నెలల పాటు జరుగుతున్న ఐపీఎల్ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తుందని గంభీర్ పేర్కొన్నాడు.
7/ 8
2 నెలల పాటు జరిగే ఐపీఎల్ ఎంతో మంది క్రికెటర్లకు ఆర్థిక భరోసాను కల్పించిందని.. క్యూరేటర్లు.. గ్రౌండ్ స్టాఫ్ కు పని దొరికేలా చేసిందని పేర్కొన్నాడు. అంతేకాకుండా యువ ప్లేయర్లను వెలుగులోకి తెచ్చిన ఘనత ఐపీఎల్ ది అంటూ గంభీర్ వ్యాఖ్యలు చేశాడు.
8/ 8
ఐసీసీ టోర్నీల్లో భారత్ వైఫల్యాలకు ఐపీఎల్ ను కారణం చేయడం మానుకోవాలని విమర్శకులకు హితవు పలికాడు. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ప్లేయర్లు సరిగ్గా ఆడకపోతే అందుకు ఐపీఎల్ ఏం చేస్తుందంటూ కామెంట్స్ చేశాడు.