IPL 2023 Mini Auction : స్టోక్స్, కరణ్, గ్రీన్ లకు కాదు.. ఈ సఫారీ పవర్ హిట్టర్ కే వేలంలో భారీ ధర.. అతడెవరంటే?
IPL 2023 Mini Auction : స్టోక్స్, కరణ్, గ్రీన్ లకు కాదు.. ఈ సఫారీ పవర్ హిట్టర్ కే వేలంలో భారీ ధర.. అతడెవరంటే?
IPL 2023 Mini Auction : ఒక రోజు జరిగే ఈ వేలం కోసం 991 మంది ప్లేయర్లు తమ ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తం 10 జట్లు ఈ వేలంలో పాల్గొననున్నాయి. అత్యధికంగా సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర డబ్బు మిగిలి ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ కోసం ఈ నెలలో బీసీసీఐ (BCCI) మినీ వేలం నిర్వహించనుంది. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న ఈ మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే.
2/ 7
ఒక రోజు జరిగే ఈ వేలం కోసం 991 మంది ప్లేయర్లు తమ ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తం 10 జట్లు ఈ వేలంలో పాల్గొననున్నాయి. అత్యధికంగా సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర డబ్బు మిగిలి ఉంది.
3/ 7
వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్స్ బెన్ స్టోక్స్, స్యామ్ కరణ్ లతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ఉన్నాడు. ఈ ముగ్గురికి కూడా ఐపీఎల్ వేలంలో భారీ డిమాండ్ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
4/ 7
అయితే వీరి కంటే కూడా మరో ప్లేయర్ ఈసారి ఐపీఎల్ లో భారీ ధర పలికే అవకావం ఉంది. గత రికార్డులను బద్దలు కొట్టే అవకాశం కూడా ఉంది.
5/ 7
దక్షిణాఫ్రికాకు చెందిన రైలీ రోసో ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ముఖ్యంగా టి20ల్లో అదరగొడుతున్నాడు. టి20 ప్రపంచకప్ కు ముందు భారత్ తో జరిగిన టి20 సిరీస్ లో రోసో భారీ శతకం బాదిన సంగతి తెలిసిందే.
6/ 7
ఆ తర్వాత పొట్టి ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ పై కూడా సెంచరీ బాదాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చే రోసో తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగగలడు.
7/ 7
ఈ క్రమంలో ఇతడి కోసం వేలంలో 10 జట్లు కూడా పోటీ పడే అవకాశం ఉంది. భారీ ధరను చెల్లించి మరీ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బెన్ స్టోక్స్, స్యామ్ కరణ్, గ్రీన్ ల కంటే కూడా భారీ ధర పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం.