IPL 2023 Mini Auction : ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన బాహుబలి హిట్టర్.. కోట్లు వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు రెడీ
IPL 2023 Mini Auction : ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన బాహుబలి హిట్టర్.. కోట్లు వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు రెడీ
IPL 2023 Mini Auction : కొచ్చి వేదికగా డిసెంబర్ 23న మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. పేరుకే మినీ వేలం కానీ.. మెగా వేలానికి మించి ధర పలికే ప్లేయర్లు ఈసారి ఆక్షన్ లోకి వచ్చే అవకాశం ఉంది.
ఒకవైపు టీమిండియా (Team India)తో సిరీస్ ల మీద సిరీస్ లు ఆడుతూ బిజీ బిజీగా గడుపుతుంది. ఇక మరోవైపు బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2023 మినీ వేలం కోసం ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తుంది.
2/ 8
కొచ్చి వేదికగా డిసెంబర్ 23న మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. పేరుకే మినీ వేలం కానీ.. మెగా వేలానికి మించి ధర పలికే ప్లేయర్లు ఈసారి ఆక్షన్ లోకి వచ్చే అవకాశం ఉంది.
3/ 8
ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టి20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ను చాంపియన్ గా నిలిబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన స్యామ్ కరణ్ తో పాటు బెన్ స్టోక్స్ కూడా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.
4/ 8
ఇక తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన పవర్ హిట్టర్ కెమరూన్ గ్రీన్ కూడా ఐపీఎల్ మినీ వేలంలోకి రానున్నాడు. ఇందుకోసం తన పేరును ఆక్షన్ లో రిజస్టర్ చేసుకున్నట్లు ప్రకటించాడు.
5/ 8
ప్రస్తుతం టి20 ఫార్మాట్ లో గ్రీన్ బాహుబలి హిట్టర్ గా ఉన్నాడు. సిక్సర్లను అవలీలగా బాదేస్తాడు. టి20 ప్రపంచకప్ ముందు భారత్ వేదికగా జరిగిన టి20 సిరీస్ లో గ్రీన్ రెచ్చిపోయి ఆడిన సంగతి తెలిసిందే.
6/ 8
హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టి20లో 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదాడు. గ్రీన్ కు బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. కీలక సమయాల్లో బౌలింగ్ చేసి వికెట్లను తీసే సత్తా ఉన్న ప్లేయర్ గ్రీన్.
7/ 8
ఇటువంటి గ్రీన్ ఇప్పుడు వేలంలోకి రానుండటంతో అతడి కోసం ఫ్రాంచైజీలు క్యూ కట్టే అవకాశం ఉంది. సన్ రైజర్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ లాంటి జట్లు గ్రీన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది.
8/ 8
ఐపీఎల్ లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు గ్రీన్ పేర్కొన్నాడు. ఐపీఎల్ తన కెరీర్ కు ఉపయోగపడే అవకాశం ఉందని గ్రీన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ద్వారా భారత్ పిచ్ లపై తనకు అనుభవం కూడా వస్తుందని.. అది స్పిన్ ను ఎదుర్కొనేలా తనను బలంగా తయారు చేస్తుందని గ్రీన్ పేర్కొన్నాడు.