తొలి సెట్లో బ్యాటర్లు ఉండగా.. రెండో సెట్లో ఆల్రౌండర్లు ఉన్నారు. మూడో సెట్లో వికెట్ కీపర్లను చేర్చగా.. నాలుగో సెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్లో స్పిన్నర్లను చేర్చారు. మినీవేలంలో సెట్ల వారీగా వేలం వేయనున్నారు. మినీ వేలంలో పాల్గొనే 10 ఫ్రాంచైజీల వద్ద మొత్తం రూ.206.5 కోట్ల పర్స్మనీ ఉంది. ఈ డబ్బులతోనే గరిష్టంగా 87 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. ఇక, ఏ జట్టు దగ్గర ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.