కర్ణాటకకు చెందిన విద్వాత్ కవరప్పకు మినీ వేలంలో భారీ మొత్తం దక్కే అవకాశం ఉంది. ఇటీవలె ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 23 ఏళ్ల కవరప్ప 8 మ్యాచ్ ల్లో 18 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఎకానమీ కేవలం 6.36గా ఉండటం విశేషం. అనంతరం జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా 8 మ్యాచ్ ల్లో 17 వికెట్లు తీసి తన ఫామ్ ను కొనసాగించాడు. ఈ బౌలర్ కోసం వేలంలో పలు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. (PC : TWITTER)
దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్ రౌండర్ జెరాల్డ్ కొట్జీపై పలు ఫ్రాంచైజీలు కన్నేశాయి. ఇటీవలె ముగిసిన CSA T20 చాలెంజ్ టోర్నీలో కొట్జీ రెచ్చిపోయాడు. 13 వికెట్లు తీశాడు. అంతేకాకుండా 207 స్ట్రయిక్ రేట్ తో 85 పరుగులు చేశాడు. చివర్లో భారీ షాట్లు ఆడటంలో కొట్జీ దిట్ట. దాంతో ఈ సఫారీ ఆల్ రౌండర్ భారీ ధర పలికే అవకాశం ఉంది. (PC : TWITTER)
నెదర్లాండ్స్ కు చెందిన పాల్ వాన్ మెకరీన్ పై మినీ వర్షంలో కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లో మెకరీన్ మెరిశాడు. 6.38 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ గెలవడంలో మెకరీన్ ముఖ్య పాత్ర పోషించాడు. 3 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇతడిపై చాలా ఫ్రాంచైజీలు కన్నేశాయి. రూ. 20 లక్షల బేస్ ప్రైజ్ తో మెకరీన్ వేలంలోకి వస్తున్నాడు. (PC : TWITTER)