SRH ఫ్రాంచైజీ తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఇటీవల ముగిసిన వేలం ముందు వదులుకుంది. IPL 2022 మెగా వేలానికి ముందు కూడా సన్‌రైజర్స్‌ను విజయవంతంగా నడిపించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం SRH కెప్టెన్ సెలక్షన్‌పై దృష్టి పెట్టింది. 2013లో ప్రారంభమైన సన్‌రైజర్స్‌కు ఇప్పటి వరకు 8 మంది కెప్టెన్లు మారారు.
కుమార సంగక్కర, కెమెరూన్ వైట్, శిఖర్ ధావన్, డారెన్ సమీ, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే వంటి వారు సన్‌రైజర్స్ సారథులుగా ఉన్నారు. అయితే ఈ సీజన్‌కు కెప్టెన్‌గా ఎవరిని సెలక్ట్ చేస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. సన్‌రైజర్స్‌కి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
* భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) : సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో భువనేశ్వర్ కుమార్‌కు ఎక్కువ అనుభవం ఉంది. 2014 నుంచి సన్‌రైజర్స్‌లో భాగంగా ఉన్నాడు. 2014కి ముందు అతను పూణే ఫ్రాంచైజీ తరఫున 3 సీజన్లు ఆడాడు. భువనేశ్వర్ 25.79 సగటుతో 154 IPL వికెట్లు తీశాడు. 7.30 ఎకానమీ రేటుతో ఆకట్టుకున్నాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో లేనప్పుడు, 2019లో ఆరు సందర్భాలలో SRHకి భువనేశ్వర్ కెప్టెన్‌గా ఉన్నాడు.
* మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) : మయాంక్ అగర్వాల్ IPLలో మొత్తం 12 సీజన్లు ఆడాడు. 2011లో అతను ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తం మూడు ఫ్రాంచైజీలకు ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2011-2013), ఢిల్లీ డేర్‌డెవిల్స్ (2013-2016), 2017–2022 వరకు పంజాబ్ తరఫున బరిలో దిగాడు. అగర్వాల్‌కు 2022లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది.
14 మ్యాచ్‌లలో ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించాడు. ఐపీఎల్ 2022లో అగర్వాల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మయాంక్ అగర్వాల్ IPL 2023 వేలంలో అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. మయాంక్ అగర్వాల్‌కు మొత్తం 113 IPL మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. IPL 2023లో SRH కెప్టెన్‌గా మయాంక్ ఒక మంచి ఆప్షన్ అవుతాడు.
* వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) : IPL 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్సీ పాత్రలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ని కూడా పరిశీలించవచ్చు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు 51 IPL మ్యాచ్‌లు ఆడాడు. 33.52 సగటుతో, 7.23 ఎకానమీ రేటుతో 33 వికెట్లు తీశాడు.వాషింగ్టన్ సుందర్ పవర్‌ప్లే ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
బ్యాటింగ్‌లో అతను 33 IPL ఇన్నింగ్స్‌లలో 120.45 స్ట్రైక్ రేట్‌తో 318 పరుగులు చేశాడు.ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా బ్యాటర్‌గా విలువైన పరుగులు చేశాడు. సుందర్ వయస్సు కేవలం 23. ఇప్పటికే ఆరు IPL సీజన్లు ఆడాడు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న సుందర్‌ను రాబోయే IPL సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంచుకోవచ్చు.