Kane Williamson : కేన్ మామకు తీవ్ర గాయం..సిక్సర్ ను ఆపబోయి కాలు విరగ్గొట్టుకున్న కివీస్ మాజీ సారథి
Kane Williamson : కేన్ మామకు తీవ్ర గాయం..సిక్సర్ ను ఆపబోయి కాలు విరగ్గొట్టుకున్న కివీస్ మాజీ సారథి
Kane Williamson : దాంతో అతడిని ఐపీఎల్ 2022 తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలించుకుంది. ఇక మినీ వేలంలో కేన్ విలియమ్సన్ ను రూ. 2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో న్యూజిలాండ్ (New Zealand) మాజీ సారథి కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఏదీ కలసి రావడం లేదు. గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కెప్టెన్ గా పూర్తి స్థాయిలో నిరాశ పరిచాడు. ఓపెనర్ గా దారుణంగా విఫలం అయ్యాడు.
2/ 8
దాంతో అతడిని ఐపీఎల్ 2022 తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలించుకుంది. ఇక మినీ వేలంలో కేన్ విలియమ్సన్ ను రూ. 2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుం
3/ 8
ఇక ఐపీఎల్ 2023లో భాగంగా జరిగిన తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ తరఫున కేన్ విలియమ్సన్ బరిలోకి దిగాడు. అయితే అతడి ఆట కేవలం 12.5 ఓవర్ల పాటు మాత్రమే సాగింది.
4/ 8
12.5 ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ స్క్వేర్ లెగ్ దిశలో భారీ షాట్ ఆడాడు. అందరు కూడా అది సిక్సర్ గా భావించారు. అయితే బౌండరీ లైన్ దగ్గర కాచుకుని ఉన్న కేన్ మామ.. టైమింగ్ తో జంప్ చేశాడు. గాల్లోకి చాలా ఎత్తు ఎగిరిన అతడు బంతి బౌండరీ అవతలకు వెళ్లకుండా క్యాచ్ పట్టాడు. (PC : TWITTER)
5/ 8
అయితే అతడు బౌండరీ లోపల కాలు పెట్టేట్లు కనిపించడంతో బంతిని బౌండరీ బయటకు విసిరి తన కుడి కాలితో ల్యాండ్ అయ్యాడు. చాలా ఎత్తు నుంచి ఒక్క కాలితో ల్యాండ్ అవ్వడంతో మెకాలు ట్విస్ట్ అయింది. అంతే వెంటనే మైదానంలో కుప్పకూలిన అతడు కాసేపు విలవిల్లాడాడు. (PC : TWITTER)
6/ 8
మోకాలిని చేత్తో పట్టుకొని తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. వెంటనే అక్కడికి గుజరాత్ ఫిజియోలు వచ్చారు. చాలా సేపటి వరకు కూడా కేన్ విలియమ్సన్ ను తన కుడి కాలిని పూర్తిగా చాపలేకపోయాడు. చాలా సేపటి తర్వాత ఫిజియోలు నెమ్మదిగా అతడి కాలిని స్ర్టయిట్ చేశారు. (PC : TWITTER)
7/ 8
ఆ తర్వాత ఇద్దరి సాయంతో కేన్ మామ డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్నాడు. చూస్తుంటే కేన్ విలియమ్సన్ కు తీవ్ర గాయం అయినట్లు కనిపించింది. గతంలో కూడా అతడి కుడి కాలికి గాయం అయ్యింది. దాంతో చాలా రోజుల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. (PC : TWITTER)
8/ 8
తాజాగా మరోసారి అదే కాలికి గాయం కావడం విచారకరం. అతడు ల్యాండ్ అవ్వడాన్ని చూస్తే మోకాలి భాగంలో లిగ్మెంట్ ఏమైనా ఫ్రాక్చర్ అయ్యిందా అనే అనుమానం కలుగుతోంది. అదే జరిగితే కేన్ మామ కెరీర్ ముగిసినట్లే. (PC : TWITTER)