తండ్రి అడుగుజాడల్లోనే క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు అర్జున్ టెండూల్కర్. అయితే అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ సాఫీగా సాగడం లేదు. ముంబైలో అవకాశాలు రాకపోవడంతో గోవా తరఫున రంజీ ట్రోఫీ బరిలోకి దిగాడు. గతేడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు విజయ్ హజారే వన్డే టోర్నీల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు.
గతేడాది అర్జున్ టెండూల్కర్ ఎంట్రీపై వార్తలు వచ్చినా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అయితే ఈసారి మాత్రం అర్జున్ టెండూల్కర్ డెబ్యూ పక్కా అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ఏడాది అర్జున్ ముంబై తరఫున ఎంట్రీ ఇవ్వకపోతే.. ఇంకెప్పుడూ జరిగే అవకాశం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. అదే జరిగితే అర్జున్ టెండూల్కర్ నెట్ బౌలర్ గా.. లేదా డ్రింక్స్ బాయ్ గానే మిగిలిపోయే అవకాశం ఉంది.