క్రికెట్ పండగ వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 16వ సీజన్ కు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడనుంది.
ఇక.. మెగా లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అద్భుతమైన రికార్డు ఉంది. ఏకంగా నాలుగు టైటిళ్లను కైవసం చేసుకుంది ధోని సేన. ఇక.. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా మరో ఐపీఎల్‌కు సిద్ధమయ్యాడు. అతని కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే అద్భుతాలు చేసింది. ఐపీఎల్ 2022లో గుజరాత్ మంచి ప్రదర్శనతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ సీజన్లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించాలని జట్టు భావిస్తోంది.
ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ 51 బంతుల్లో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్లో గుజరాత్ 13 పరుగులు చేయాల్సి వచ్చింది. మిల్లర్ క్రిస్ జోర్డాన్ బౌలింగ్ లో ఫోర్లు, సిక్సర్లతో కొట్టి గెలిపించాడు. (IPL Twitter)
రెండో మ్యాచ్‌లో గుజరాత్ ఏకపక్షంగా 7 వికెట్ల తేడాతో సీఎస్కేపై విజయం సాధించింది. ఈ మ్యాచులో చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ కు దిగి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. రుతురాజ్ మరోసారి 53 పరుగులు చేశాడు. దీనికి సమాధానంగా, వృద్ధిమాన్ సాహా అజేయంగా 67 పరుగులు చేయడంతో గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. (BCCI/IPL)