కానీ, అది ఒకటి రెండు మ్యాచులు ముచ్చట మాత్రమే. ఆ తర్వాత మనోడ్ని జట్టు నుంచి తీసేస్తున్నారు. అయితే.. సత్తా చాటుకోవడానికి అతనికి మరిన్ని ఛాన్సులు ఇవ్వాలని ఫ్యాన్స్‌తో మాజీల నుంచి డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. టీమ్ ఇండియాలో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ మరియు రిషబ్ పంత్‌లకు ప్రత్యామ్నాయంగా సంజూ వికెట్ కీపర్ బ్యాటర్ గా కనిపిస్తున్నాడు. (ANI)
మరోవైపు వన్డే క్రికెట్ గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటి వరకు కేవలం 10 సార్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగాడు. ఈ సమయంలో.. అతని బ్యాట్ నుండి 66 సగటుతో 36, 2*, 30*, 86*, 15, 43*, 6*, 54, 12, 46 పరుగులు వచ్చాయి. వన్డేల్లో సంజూ ప్రదర్శన అద్భుతం. అయితే.. ఇప్పటికీ అవకాశాలు దక్కడం లేదు. త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సంజు కీలక జట్టులో భాగమని రాహుల్ ద్రవిడ్ ఇటీవలే స్పష్టం చేశాడు. (IPL)