ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) అద్భుతం చేసింది. నిలకడైన ఆటతీరుతో మొదట ప్లే ఆఫ్స్ కు చేరింది. ఇక ప్లే ఆఫ్స్ లో భాగంగా జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)పై నెగ్గి ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.
ఓవరాల్ గా అతడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్లే ఆఫ్స్ లో 10 వికెట్లు తీశాడు. వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేస్తూ చెన్నై విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. 2018 ఫైనల్లో దీపక్ చహర్ వికెట్ తీయకపోయినా 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక 2021 సీజన్లో ఒక వికెట్ సాధించాడు. ఈ రెండు సార్లు కూడా చెన్నై చాంపియన్ గా నిలిచింది.