Rishabh Pant : పంత్ యాక్సిడెంట్ తో ఢిల్లీ క్యాపిటల్స్ లో మారిన సమీకరణాలు.. తదుపరి కెప్టెన్ ఇతడేనా?
Rishabh Pant : పంత్ యాక్సిడెంట్ తో ఢిల్లీ క్యాపిటల్స్ లో మారిన సమీకరణాలు.. తదుపరి కెప్టెన్ ఇతడేనా?
Rishabh Pant : ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన రిషభ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడి మోకాలికి తీవ్ర గాయం కూడా అయ్యింది. ఈ క్రమంలో పంత్ ఈ ఏడాది మొత్తం క్రికెట్ కు దూరమయ్యే అవకాశం ఉంది.
టీమిండియా (Team India) యువ వికెట్ కీపర్.. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదంలో దగ్ధమైన సంగతి తెలిసిందే.
2/ 7
ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన రిషభ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడి మోకాలికి తీవ్ర గాయం కూడా అయ్యింది. ఈ క్రమంలో పంత్ ఈ ఏడాది మొత్తం క్రికెట్ కు దూరమయ్యే అవకాశం ఉంది.
3/ 7
పంత్ గాయపడటం టీమిండియాతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కు కూడా ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. మార్చి నెలాఖరులో ఆరంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ లో పంత్ ఆడటం లేదని ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశాడు.
4/ 7
ఈ క్రమంలో పంత్ స్థానంలో ఎవర్ని కెప్టెన్ చేయాలనేది ఫ్రాంచైజీకి తలనొప్పిగా మారింది. ఢిల్లీ కెప్టెన్సీ రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
5/ 7
ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అందరికంటే ముందున్నాడు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కూడా వార్నర్ కెప్టెన్ గా వ్యవహిరించిన సంగతి తెలిసిందే.
6/ 7
వార్నర్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ చాంపియన్ గా నిలిచింది. అనుభవం రిత్యా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని వార్నర్ కు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
7/ 7
అయితే వార్నర్ తో పాటు మరో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. మార్ష్ తో పాటు భారత యువ ఓపెనర్ పృథ్వీ షా పేరును కూడా కెప్టెన్సీ కోసం పరిగణిస్తున్నట్లు సమాచారం.