అయితే ఇరు జట్లలోనూ బౌలింగ్ మైనస్ గా కనిపిస్తోంది. ఇరు జట్లలో నమ్మకంగా జట్టును గెలిపించేలా ఉన్న బౌలర్లు కనిపించడం లేదు. జస్ ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కావడంతో ముంబై బౌలింగ్ పేలవంగా మారింది. ముంబైలో జోఫ్రా ఆర్చర్ ఉన్నా అతడు ఎంత మేరకు రాణిస్తాడో చూడాలి. బెహ్రాండార్ఫ్ పేస్ ఎంత వరకు సక్సెస్ అవుతోందో చెప్పలేని పరిస్థితి. ఇక కుమార్ కార్తీకేయ, సోకీన్ యువ స్పిన్నర్లుగా ఉన్నారు. వెటరన్ పీయూశ్ చావ్లా ఎంత వరకు రాణిస్తాడో చూడాలి. ఓవరాల్ గా ముంబై బౌలింగ్ స్ట్రాంగ్ గా కనిపించడం లేదు.