1. ఎంఎస్ ధోని : ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా ఆర్జించిన వ్యక్తిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. గత ఏడాది (2022) వరకు ధోనీ ఐపీఎల్ నుంచి రూ.164 కోట్ల 84 లక్షలు సంపాదించాడు. అతను 2018 నుంచి 2012 వరకు ఏటా రూ.15 కోట్లు తీసుకున్నాడు. కానీ గత రెండేళ్లుగా తన ఫీజును రూ.12 కోట్లకు తగ్గించుకున్నాడు. ధోని మొత్తం IPL సంపాదన రూ. 176 కోట్ల 84 లక్షలు.
3. విరాట్ కోహ్లీ : విరాట్ కోహ్లీ 2008 నుంచి కూడా ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు. కోహ్లీ మినహా మరే ఇతర ప్లేయర్ కూడా ఒకే ఫ్రాంచైజీకి వరుసగా ఆడటం లేదు. టోర్నీ ప్రారంభమైన సంవత్సరం నుంచి కోహ్లీ ఆటతీరు, సంపాదన పెరుగుతూనే ఉన్నాయి. ఐపీఎల్ నుంచి గత సీజన్ వరకు కోహ్లి రూ.150 కోట్ల 20 లక్షలు సంపాదించాడు. 2018 నుంచి 2021 వరకు కోహ్లీ RCB నుంచి రూ.17 కోట్లను వార్షిక వేతనంగా అందుకున్నాడు. గతేడాది నుంచి రెమ్యునరేషన్ గా రూ.15 కోట్లు తీసుకున్నాడు.
5. ఎబి డివిలియర్స్ : దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆటగాడు ఎబి డివిలియర్స్ కూడా ఐపీఎల్ ద్వారా భారీ మొత్తాన్ని ఆర్జించాడు.ఈ మిస్టర్ 360.. ఐపీఎల్ ద్వారా 100 కోట్ల 51 లక్షల 65 వేల రూపాయలను ఆర్జించాడు. ఈ మొత్తాన్ని కూడా రెమ్యునరేషన్ రూపంలో దక్కించుకున్నాడు. డివిలియర్స్ చివరిసారిగా 2021లో ఐపీఎల్ లో ఆడాడు. అతని చివరి వార్షిక వేతనం రూ.11 కోట్లు.