ఈ క్రమంలో లివింగ్ స్టోన్ తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండేది అనుమానంగానే కనిపిస్తుంది. ఇది ఒక్క మ్యాచ్ కు పరిమితమా.. లేక మరికొన్ని మ్యాచ్ లకు కూడా అతడు దూరం కాబోతున్నాడా అనేది తేలాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్ లో లివింగ్ స్టోన్ కీలక ప్లేయర్. భారీ షాట్లు ఆడటంతో పాటు అవసరం అయితే బౌలింగ్ కూడా చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయర్. అయితే ప్రస్తుతం అతడు ఇంకా ఫిట్ నెస్ సాధించకపోవడం పంజాబ్ కింగ్స్ కు ప్రతికూల అంశంగా మారిపోయింది.