చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుత వయసు 41 ఏళ్లు. క్రీడా పండితుల ప్రకారం ధోనికి ఇదే లాస్ట్ సీజన్. ఈ సీజన్ లోనే ధోని వీడ్కోలు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. దీంతో.. ఈ సీజన్ లో తలైవా మెరుపుల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ సీజన్ లో రెండు అరుదైన రికార్డులపై కన్నేశాడు.
ఈ సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ CSK తరుపున సిక్సర్ల రికార్డును కూడా బద్దలు కొట్టగలడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మహి 199 సిక్సర్లు కొట్టాడు. సిక్సర్ కొట్టగానే 200 సిక్సర్ల మైలు రాయి అందుకుంటాడు. దీంతో.. ఈ ఘనత సాధించే తొలి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేయనున్నాడు. (ANI/Twitter)