ఇప్పటి వరకు 15 సీజన్లు పూర్తి కాగా.. 6 జట్లు మాత్రమే చాంపియన్ గా నిలిచాయి. అత్యధికంగా 5 సార్లు ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (4 సార్లు) ఐపీఎల్ టైటిల్ ను నెగ్గాయి. కోల్ కతా నైట్ రైడర్స్ రెండు సార్లు నెగ్గితే.. డెక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ లు తలా ఒకసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకున్నాయి.
అయితే ఈసారి మాత్రం తమ తలరాతను మార్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండటంతో పాటు ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్, రజత్ పటిదార్ లు తమ బ్యాట్ కు పని చెబితే ఆర్సీబీని ఆపడం ఎవరి తరం కాదు. ఈసారైనా కప్పు గెలిచి ఐపీఎల్ టైటిల్ లోటును పూడ్చుకోవాలని పట్టుదలగా ఆర్సీబీ ఉంది.