Mumbai Indians : ఇషాన్ కిషన్ వద్దు.. అతడే ముద్దు.. ఓపెనర్ విషయంలో రోహిత్ శర్మ డేరింగ్ డెసిషన్
Mumbai Indians : ఇషాన్ కిషన్ వద్దు.. అతడే ముద్దు.. ఓపెనర్ విషయంలో రోహిత్ శర్మ డేరింగ్ డెసిషన్
Mumbai Indians : హార్దిక్ పాండ్యా, బౌల్ట్, రాహుల్ చహర్ లాంటి కీలక ప్లేయర్లను కోల్పోయింది. మెగా వేలంలో మంచి ప్లేయర్లను కొనుగోలు చేసినా టీంగా సక్సెస్ కాలేకపోయింది. అయితే 2023లో మాత్రం చాంపియన్ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది.
రికార్డు స్థాయిలో ఐదు సార్లు ఐపీఎల్ (IPL 2023) చాంపియన్.. ప్రతి ఏడాది హాట్ ఫేవరెట్ ట్యాగ్ తో టోర్నీలో ఎంట్రీ.. జట్టు నిండా స్టార్ ప్లేయర్లే.. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించే మ్యాచ్ విన్నర్స్.. వెరసి ముంబై ఇండియన్స్ (Mumbai Indians). అయితే గత సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలం అయ్యింది.
2/ 7
హార్దిక్ పాండ్యా, బౌల్ట్, రాహుల్ చహర్ లాంటి కీలక ప్లేయర్లను కోల్పోయింది. మెగా వేలంలో మంచి ప్లేయర్లను కొనుగోలు చేసినా టీంగా సక్సెస్ కాలేకపోయింది. అయితే 2023లో మాత్రం చాంపియన్ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది.
3/ 7
అయితే టోర్నీ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ డేరింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ఆరంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ లో ఓపెనర్ విషయంలో రోహిత్ శర్మ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
4/ 7
ఇషాన్ కిషన్ ను కాదని.. ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ కెమెరూన్ గ్రీన్ ను ఓపెనర్ గా బరిలోకి దించాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మతో పాటు గ్రీన్ ముంబై తరఫున ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది.
5/ 7
గతేడాది టి20 ప్రపంచకప్ ముందు భారత్ తో జరిగిన టి20 సిరీస్ లో కెమెరూన్ గ్రీన్ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్ దూరం కావడంతో అతడి స్థానంలో ఓపెనింగ్ కు వచ్చిన అతడు భారత బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే.
6/ 7
ఇప్పుడు కూడా కెమెరూన్ గ్రీన్ ను ఓపెనర్ గా ప్రత్యర్థులపై ప్రయోగించాలనే నిర్ణయంతో అటు కోచ్ బౌచర్.. ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. నాలుగో స్థానంలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ లు బరిలోకి దిగే అవకాశం ఉంది.
7/ 7
టిమ్ డేవిడ్ విఫలం అయితే డివాల్డ్ బ్రేవిస్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇక బౌలర్లుగా జోఫ్రా ఆర్చర్, బెహ్రాండార్ఫ్, కుమార్ కార్తీకేయ ఉండనున్నారు. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం సక్సెస్ అవుతుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.