ధనాధన్ క్రికెట్‌కు వేళయింది. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2023 మొదలవనుంది. మార్చి 31 న చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచుతో ఐపీఎల్ 2023 (IPL 2023) ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నాహకాల్ని ప్రారంభించాయి. అయితే.. ఐపీఎల్ తొలి వారం కొంత మంది సౌతాఫ్రికా సూపర్ స్టార్ బ్యాటర్లు దూరం కానున్నారు. దీంతో.. ఆయా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్ల సేవల్ని కోల్పోనున్నాయి.(AP)
దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు జాతీయ డ్యూటీలో బిజీగా ఉండడమే ఇందుకు కారణం. ఆఫ్రికా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. దీని తర్వాత ఏప్రిల్ 2 వరకు నెదర్లాండ్స్‌తో రెండు వన్డేలు ఆడాల్సి ఉంది. వన్డే వరల్డ్ కప్ 2023 దృష్ట్యా సౌతాఫ్రికా ఈ మ్యాచులు కీలకం. దీంతో.. పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తుంది. దీంతో.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తొలి వారం షాక్ తప్పేలా లేదు. (AP)
ఆఫ్రికన్ ఆటగాళ్లు అందుబాటులో లేకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కువగా నష్టపోతుంది. ఈ ఫ్రాంచైజీ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కూడా తొలివారం అందుబాటలో ఉండడు. కెప్టెన్ తో పాటు స్టార్ బ్యాటర్ హెన్రీ క్లాసెన్ రూపంలో కూడా మరో ఝలక్ తగలనుంది. మార్కో జాన్సెన్ వంటి స్టార్ ఆల్ రౌండర్ సేవల్ని కూడా కోల్పోనుంది సన్ రైజర్స్. (Twitter/SRH)
గుజరాత్ టైటాన్స్ జట్టు డేవిడ్ మిల్లర్ సేవలను కోల్పోనుంది. గత సీజన్లో హార్దిక్ పాండ్యా జట్టులో రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు డేవిడ్ మిల్లర్. గుజరాత్ జట్టు మిడిల్ ఆర్డర్లో మిల్లర్ మూలస్తంభం. ఇలాంటి స్టార్ ప్లేయర్ లేకపోవడం గుజరాత్ కు భారీ లోటు అనే చెప్పాలి. (IPL/Twitter)
తొలి వారంలో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ సేవలను పంజాబ్ కింగ్స్ కోల్పోనుంది. రబాడ ఒక డేంజరస్ ఫాస్ట్ బౌలర్. శిఖర్ ధావన్ కెప్టెన్సీ జట్టులో రబాడ లేకపోతే పేస్ విభాగం చాలా బలహీనంగా కనిపిస్తుంది. CSK జట్టులో భాగమైన సిసంద మగాళ కూడా అందుబాటులో ఉండరు. అయితే అతని గైర్హాజరు కారణంగా ధోనీ జట్టు పెద్దగా నష్టపోయేది ఏం లేదు. (AP)