ఇప్పటికే విల్ జాక్స్ టోర్నీకి దూరమవ్వగా.. స్పీడ్‌స్టర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మరో ఆసీస్ ఆటగాడు, ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదు. లంక స్పిన్నర్ హసరంగ కూడా ఐపీఎల్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నాడని తెలుస్తోంది. మరో బ్యాటర్ రజత్ పాటిదార్ కూడా ఇదే బాటలో నడవనున్నాడు.