IPL 2023 : ఆర్సీబీ అభిమానుల గుండెలు బద్దలయ్యే వార్త.. సెంచరీ హీరోకు గాయం.. టోర్నీ నుంచి అవుట్?
IPL 2023 : ఆర్సీబీ అభిమానుల గుండెలు బద్దలయ్యే వార్త.. సెంచరీ హీరోకు గాయం.. టోర్నీ నుంచి అవుట్?
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును గాయాల బెడద పట్టుకుంది. ఇప్పటికే జాష్ హేజల్ వుడ్ గాయంతో ఉన్నాడు. ఇక గ్లెన్ మ్యాక్స్ వెల్ తన కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. తాజాగా మరో ప్లేయర్ ట్రయినింగ్ సెషన్ లో గాయపడ్డాడు.
అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సిద్ధమైంది. ఐపీఎల్ 16వ ఎడిషన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడనుంది.
2/ 8
ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును గాయాల బెడద పట్టుకుంది. ఇప్పటికే జాష్ హేజల్ వుడ్ గాయంతో ఉన్నాడు. ఇక గ్లెన్ మ్యాక్స్ వెల్ తన కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. తాజాగా మరో ప్లేయర్ ట్రయినింగ్ సెషన్ లో గాయపడ్డాడు.
3/ 8
గతేడాది జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో శతకంతో మెరిసిన రజత్ పటిదార్ ట్రయినింగ్ సెషన్ లో గాయపడ్డాడు. అతడి కాలి మడమకు గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి.
4/ 8
వెంటనే బెంగళూరులోని NCAకు రజత్ పటిదార్ వెళ్లగా.. అతడిని పరిశీలించిన వైద్యులు మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రజత్ పటిదార్ మూడు వారాల పాటు ఐపీఎల్ కు దూరం అయ్యే అవకాశం ఉంది.
5/ 8
ఇప్పటికే తొడ కండరాల గాయంతో స్టార్ పేసర్ హేజల్ వుడ్ ఈ సీజన్ లో ఆడతాడో లేదో అనే అనుమానం ఉంది. ఇక సీజన్ ఆరంభానికి ముందు తాను 100 శాతం ఫిట్ గా లేనంటూ మ్యాక్స్ వెల్ బాంబు పేల్చాడు.
6/ 8
గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ అనంతరం మ్యాక్స్ వెల్ కాలికి ప్రమాదం జరిగింది. అనంతరం అతడి కాలికి సర్జరీ కూడా చేశారు. దాంతో అతడు దాదాపు 6 నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు.
7/ 8
గాయం నుంచి కోలుకున్న అతడు భారత్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఆడాడు. అయితే తొలి మ్యాచ్ అనంతరం అతడు మళ్లీ బరిలోకి దిగలేదు. దాంతో అతడి ఫిట్ నెస్ పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా మ్యాక్స్ వెల్ తన నోటి నుంచే తాను 100 శాతం ఫిట్ గా లేనని ప్రకటించాడు.
8/ 8
మ్యాక్స్ వెల్ న్యూస్ నుంచి తేరుకోక ముందే.. రజత్ పటిదార్ కు గాయం అవ్వడం ఆర్సీబీ అభిమానులను కలవర పెడుతోంది. కీలక ప్లేయర్లు గాయాలతో ఉండటంతో ఇప్పుడు బాధ్యత అంతా కోహ్లీ, డుప్లెసిస్, దినేశ్ కార్తీక్ లపైనే పడింది.