క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో మెగా టోర్నీకి తెర లేవనుంది. మార్చి 31న అహ్మాదాబాద్ వేదికగా జరిగే లీగ్ తొలి మ్యాచులో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మధ్య జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ప్రపంచకప్‌లో ఆడే ప్రతీ ఆటగాడి వర్క్‌లోడ్‌ను టీమ్ మేనేజ్మెంట్ పరిశీలిస్తుందని, ఫ్రాంచైజీలు తమ ఆయా ప్లేయర్స్ వర్క్‌లోడ్‌ను సమన్వయం చేసుకోవాలని చెప్పాడు. టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధత బీసీసీఐ చెప్పిన ప్రకారమే ఉంటుందని హిట్ ఇచ్చాడు. అందుకే కెప్టెన్ హోదాలో ఉన్న రోహిత్.. ఇతర ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచేందుకు ఐపీఎల్ 2023లోని కొన్ని మ్యాచ్‌లు ఆడకుండా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట.