ఐపీఎల్ 2023 వేలం (IPL 2023 Auction)లో ముంబై ఇండియన్స్ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను రూ. 17.50 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబై చరిత్రలో ఇదే అతిపెద్ద బిడ్. గ్రీన్ కంటే ముందు.. సామ్ కర్రాన్ ఐపిఎల్ చరిత్రలో అత్యధిక బిడ్ అందుకున్నాడు. కర్రన్ ను పంజాబ్ రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో సామ్ కర్రన్.. క్రిస్ మోరిస్‌ను అధిగమించాడు. 2021 వేలంలో మోరిస్‌కు రాజస్థాన్ రూ. 16.25 కోట్లు చెల్లించింది. అయితే.. ఈ వేలం తర్వాత కామెరాన్ గ్రీన్ , అతని ప్రేయసి ఎమిలీ రెడ్‌వుడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఈ జోడి.. బాలీవుడ్ సూపర్ హిట్ జంట అమితాబ్ బచ్చన్ మరియు జయా బచ్చన్ ను గుర్తుకు తెస్తున్నారు. (Emily Redwood/Instagram)
కొన్ని నెలల క్రితం భారత పర్యటనలో 23 ఏళ్ల కెమరూన్ గ్రీన్ మెరుపులు మెరిపించాడు. ఈ మెరుపులు తర్వాత గ్రీన్.. ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. తొలిసారి వేలంలో పాల్గొన్న కెమరూన్ గ్రీన్ బేస్ ధర రూ.2 కోట్లు. గ్రీన్ ఈ బేస్ ప్రైజ్ కంటే చాలా రెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ వేలం సందర్భంగా కామెరాన్ గ్రీన్ ప్రేయసి మిలీ కూడా కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. (Emily Redwood/Instagram)
కామెరాన్ మరియు ఎమిలీల ఎత్తు వ్యత్యాసం వారి ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తుంది. 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్న కామెరూన్ ముందు ఎమిలీ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఎమిలీ ఫిబ్రవరి 2022లో పట్టభద్రురాలైంది. కామెరాన్ గ్రీన్ కూడా ఎమిలీ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. (Cameron Green/Instagram)