ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ తొలిసారిగా ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొన్నాడు. బ్రూక్ బేస్ ప్రైస్ రూ. 1.50 కోట్లు. మొదట అంతర్జాతీయ బ్యాటర్లను వేలం వేయగా.. హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)కు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. ఆర్సీబీ, రాజస్థాన్‌లను వెనక్కినెట్టి అతణ్ని (కనీస ధర రూ.1.5 కోట్లు) రూ.13.25 కోట్లకు సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్‌లో టీ20 సిరీస్‌లో బ్రూక్ పవర్‌హిట్టింగ్‌తో అదరగొట్టాడు. (Harry Brook/Instagram)
లూసీ లైల్స్ ట్విట్టర్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది. తరచుగా తన పోస్ట్‌లలో హ్యారీ బ్రూక్‌కి సంబంధించిన విషయాలను పంచుకుంటుంది లూసీ. హ్యారీ బ్రూక్ ట్విట్టర్ ఖాతాను తొలగించిన విషయాన్ని లూసీ తన పోస్ట్‌లో షేర్ చేసింది. 16 జూన్ 2020న హ్యారీ బ్రూక్ యొక్క ఇన్‌స్టాగ్రామ్‌లో లూసీ మొదటిసారి కనిపించింది. బ్రూక్ లూసీతో అందమైన సెల్ఫీని పంచుకున్నాడు. (Harry Brook/Instagram)
అప్పటి నుంచే.. హ్యారీ బ్రూక్ .. లూసీ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని ఫ్యాన్స్ భావించారు. లూసీ మరియు హ్యారీ అందమైన జంట. ఇద్దరి చిరునవ్వు అభిమానుల హృదయాలను కొల్లగొడుతుంది. అయితే, లూసీ ఏమి చేస్తుందనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ బ్రూక్ జీవితంలో ఆమె ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. Harry Brook/Instagram)
ఇక, 23 ఏళ్ల హ్యారీ బ్రూక్ 2022లో బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తరఫున బ్రూక్ 17 ఇన్నింగ్స్‌లలో 137.77 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అతను ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో కూడా సభ్యుడు. ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బ్రూక్ వరుసగా 3 సెంచరీలు సాధించాడు. ఈ సిరీస్‌లో 468 పరుగులు చేసి 125 ఏళ్ల రంజిత్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. (Harry Brook/Instagram)
హ్యారీ బ్రూక్ 2016లో యార్క్‌షైర్‌కు అరంగేట్రం చేసినప్పుడు, అతను ఇంకా పాఠశాలలో చదువుతున్నాడు. ఓ ఏడాది తర్వాత అతను కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో కనిపించాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు కూడా బ్రూక్ కెప్టెన్‌గా ఉన్నాడు. బ్రూక్ యొక్క దేశీయ రికార్డులు అతనికి ఉజ్వల భవిష్యత్తును సూచిస్తున్నాయి. (Harry Brook/Instagram)