IPL 2023 (IPL 2023) కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాబోయే సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలం డిసెంబర్ 23 శుక్రవారం కొచ్చిలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు వేలం ప్రారంభం కానుంది. ఇక, అన్ని ఫ్రాంఛైజీలు తమను విజేతగా నిలిపే ఆటగాళ్ల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సై అంటున్నాయి. ఇక, ఈ మెగా ఆక్షన్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. అంతేకాకుండా అనుభవజ్ఞుడైన కెప్టెన్. ప్రస్తుతం టెస్టు ఫార్మాట్లో ఇంగ్లిష్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టాపార్డర్, మిడిలార్డర్, ఫినిషర్ రోల్ ఇలా ఏ బ్యాటింగ్ పోజిషన్ అయినా బెన్ స్టోక్స్ సమర్ధవంతంగా పోషించగలడు. ఐపీఎల్ లోనూ ఓపెనర్ గా బరిలోకి దిగాడు బెన్ స్టోక్స్. (AP)
ఇక, అంతర్జాతీయ క్రికెట్ లో.. బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ తరపున 43 మ్యాచ్‌లు ఆడాడు. 36 ఇన్నింగ్స్‌లలో 21.67 సగటుతో 585 పరుగులు చేశాడు. అయితే, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో 36 ఇన్నింగ్స్‌ల్లో 26 వికెట్లు సాధించాడు. అయితే, లేటెస్ట్ గా జరిగిన టీ20 ప్రపంచకప్ లో బెన్ స్టోక్స్ అద్భుతమైన మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. దీంతో.. సన్ రైజర్స్ బెన్ స్టోక్స్ ను తీసుకుంటే ఆ జట్టు కష్టాలు 90 శాతం తీరినట్టే అని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. (AP)