ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆడుతుంది. అంటే 2008 నుంచి ఆడుతుంది. కానీ టీ20 లీగ్ టైటిల్‌ను ఇప్పటి వరకు గెలవలేకపోయింది. ప్రస్తుత సీజన్ లో ఇప్పటికే కెప్టెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదం వల్ల జట్టుకు దూరమయ్యాడు. పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ కి ఈ ఏడాది కెప్టెన్సీ దక్కింది. (PTI)
ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ టాప్ ఆర్డర్‌ను వెల్లడించాడు. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా ఓపెనర్లగా బరిలోకి దిగుతారడని తెలిపాడు. అదే సమయంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు నంబర్-3లో బరిలోకి దిగనున్నాడు. ఇక.. ప్రస్తుత మిచెల్ మార్ష్ ఫాం చూస్తే బౌలర్లు వణకాల్సిందే. (AP)
మిచెల్ మార్ష్ ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించి జట్టుకు 2-1తో భారీ విజయాన్ని అందించాడు. ఈ సిరీస్‌లో మార్ష్ 2 హాఫ్ సెంచరీల సహాయంతో సిరీస్‌లో అత్యధికంగా 194 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 131. 24 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. అలవోకగా.. సిక్సర్లు బాది భారత బౌలర్లకు చుక్కలు చూపాడు (AP)
31 ఏళ్ల ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ అంతకుముందు 2021 T20 ప్రపంచ కప్‌లో మంచి ప్రదర్శన చేసి ఆస్ట్రేలియాను మొదటి సారి ఛాంపియన్ చేశాడు. ఫైనల్లో కంగారు జట్టు పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. (AP)
మిచెల్ మార్ష్ మొత్తం T20 కెరీర్ గురించి మాట్లాడితే.. అతను ఇప్పటివరకు 155 మ్యాచ్‌లలో 145 ఇన్నింగ్స్‌లలో 33 సగటుతో 3693 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 46 టీ20 ఇంటర్నేషనల్స్‌లో దాదాపు 1100 పరుగులు చేశాడు. 6 అర్ధ సెంచరీలు బాదాడు. మిచెల్ ప్రస్తుత ఫాం భీకరంగా ఉంది. మిచెల్ మార్ష్ ను వీలైనంత త్వరగా ఔట్ చేయకపోతే ప్రత్యర్థి జట్టు కొంపమునిగినట్టే. (AP)