అటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఈ టోర్నీకి ముందు అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. వెన్ను గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో అతడి స్థానంలో కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వినిపించాయి. అయితే అతడితో పాటు మరో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ కూడా ఈ సీజన్ మెగాటోర్నీలోని పలు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండట్లేదని సమాచారం. (image credit Twitter/i_Prathit)