Andre Russell : రస్సెల్ మిసైల్.. ఆ ఇద్దరి తర్వాత అదిరిపోయే రికార్డు సొంతం చేసుకున్న విండీస్ వీరుడు..
Andre Russell : రస్సెల్ మిసైల్.. ఆ ఇద్దరి తర్వాత అదిరిపోయే రికార్డు సొంతం చేసుకున్న విండీస్ వీరుడు..
IPL 2023: గత కొన్ని సీజన్లుగా కోల్‌కతా నైట్ రైడర్స్ లైనప్ లో ఆండ్రీ రస్సెల్ ఓ కీలక ఆటగాడు. తనదైన బ్యాటింగ్, బౌలింగ్ తో ఆట స్వరూపాన్ని క్షణాల్లో మార్చగలడు.
IPL 2023 (IPL 2023) రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం మొహాలీలో జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. (Punjab Kings/Instagram)
2/ 6
ఇక.. ఈ మ్యాచులో విండీస్ పవర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ మంచి టచ్ లో కనిపించాడు. తనదైన శైలిలో సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు. కానీ అతను జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. (Andre Russell/Instagram)
3/ 6
పంజాబ్‌పై ఏడో నంబర్లో బ్యాటింగ్ కి దిగిన రస్సెల్ మొత్తం 19 బంతుల్లో 35 పరుగులు చేశాడు. 184.21 స్ట్రైక్ రేట్ తో రస్సెల్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఇక, ఈ మ్యాచులో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.(Andre Russell/Instagram)
4/ 6
ఈ మ్యాచులో చెలరేగిన రస్సెల్ కేకేఆర్ తరఫున స్పెషల్ జాబితాలో చేరాడు. కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచులో కేకేఆర్ తరఫున రెండు వేల పరుగుల మార్క్ అందుకున్నాడు.(Andre Russell/Instagram)
5/ 6
మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఇప్పటికీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున గంభీర్ అత్యధికంగా 3345 పరుగులు చేశాడు. (గౌతమ్ గంభీర్/ఇన్స్టాగ్రామ్)
6/ 6
ఇక.. రెండో స్థానంలో మరో భారత ఆటగాడు ఉన్నాడు. అది మరెవరో కాదు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప. ఉతప్ప కేకేఆర్ తరఫున ఆడుతూ 2,439 పరుగులు చేశాడు. ఇక.. రస్సెల్ ఓవరాల్ గా ఐపీఎల్ లో 2077 పరుగులు చేశాడు. (AFP)