IPL 2023 : ఐపీఎల్ లో ఈసారి ఈ నాలుగు జట్లదే హవా.. మిగిలిన జట్లకు అంత సీన్ లేదట.. తేల్చేసిన మిస్టర్ 360
IPL 2023 : ఐపీఎల్ లో ఈసారి ఈ నాలుగు జట్లదే హవా.. మిగిలిన జట్లకు అంత సీన్ లేదట.. తేల్చేసిన మిస్టర్ 360
IPL 2023 : సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డీవిలియర్స్ ఈసారి ఐపీఎల్ కామెంటేటర్ గా ఉన్నాడు. జియో సినిమాలో అతడు తన కామెంట్రీని చెబుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు చేరే జట్ల గురించి జోస్యం చెప్పాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ ఘనంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)పై గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను అలరించింది.
2/ 7
సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డీవిలియర్స్ ఈసారి ఐపీఎల్ కామెంటేటర్ గా ఉన్నాడు. జియో సినిమాలో అతడు తన కామెంట్రీని చెబుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు చేరే జట్ల గురించి జోస్యం చెప్పాడు.
3/ 7
ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్ కు చేరే నాలుగు జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉంటుందని డీవిలియర్స్ పేర్కొన్నాడు. ఈసారి ఐపీఎల్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.
4/ 7
ఆర్సీబీతో పాటు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందని డీవిలియర్స్ తన ప్రిడిక్షన్ చెప్పాడు. చెన్నైని ధోని ప్లే ఆఫ్స్ కు చేరుస్తాడని నమ్మకంగా చెప్పాడు.
5/ 7
ఈ రెండు జట్లతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుందని ఈ మిస్టర్ 360 నమ్మకంగా చెప్పాడు. ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఐపీఎల్ లో మ్యాజిక్ చేస్తుందంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు.
6/ 7
ఇక గతేడాది చాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ కూడా ఐపీఎల్ కు చేరుకుంటుందని ఏబీ తెలిపాడు. హార్దిక్ పాండ్యా నాయత్వంలోని గుజరాత్ టైటాన్స్ అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందంటూ పేర్కొన్నాడు.
7/ 7
ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెయింట్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్లను కాదని ఏబీ తన ప్లే ఆఫ్స్ జట్లను ప్రకటించడం విశేషం. కొందరు ఏబీ ప్రిడిక్షన్ ను శబాష్ అంటుంటే మరికొందరు తప్పని పేర్కొంటున్నారు.