బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్లోరాజస్తాన్ ఓడినప్పటికి చాహల్ మాత్రం ఒక అరుదైన ఫీట్ సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చాహల్ నిలిచాడు. ఈ సీజన్లో చాహల్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 23 వికెట్ల తీశాడు. ఈ సీజన్లో రాజస్తాన్ తరపున ఇదే అత్యుత్తమం.
ఐపీఎల్ మెగా వేలం-2022కు ముందు క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నాడు టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్. రిటెన్షన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేయగా వేలంలోకి వచ్చాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ పోటీ పడి మరీ ఆరున్నర కోట్లు వెచ్చించి చాహల్‌ను సొంతం చేసుకుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోని చాహల్.. ఈ ప్రదర్శనతో ఈ ఏడాది జరిగనున్న మెగాటోర్నిలో టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు క్రీడా పండితులు.