[caption id="attachment_1120674" align="alignnone" width="589"] మరో పక్క వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ లను చూస్తే వారికి ధోనికి లభించినంత మద్ధతు లభించలేదన్నాడు. అందుకే వీరి కెరీర్ లు సడెన్ గా ముగిసిపోయాయి. ’నీ మెడపై కత్తి వేలాడుతుందని మీకు తెలిసినపుడు మీరు స్వేచ్ఛగా ఆడలేరు. అదే సెహ్వాగ్, గంభీర్, హర్భజన్, లక్ష్మణ్ విషయాల్లో జరిగాయి. మీకు జట్టులోని కెప్టెన్, కోచ్ ల నుంచి మద్దతు ఉంటే మీ ఆటతీరు వేరేలా ఉంటుంది.‘అని యువీ పేర్కొన్నాడు.
యువరాజ్ సింగ్ 2019 లో క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ధోని సంవత్సరం తర్వాత 2020 ఆగస్టు 15న క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ధోని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు మరోసారి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ధోని కెప్టెన్సీలోని చెన్నై ఆదివారం జరిగిన మ్యాచ్ లో పై 13 పరుగుల తేడాతో గెలుపొందింది.