సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) స్వదేశానికి చేరుకున్నాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశానికి పయనమయ్యాడు. కేన్ సతీమణి సారా రహీం త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో.. ఆమె పక్కన ఉండేందుకు సన్‌రైజర్స్ సారథి ఉన్నపళంగా న్యూజిలాండ్‌కు బయలుదేరాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 22న లీగ్ దశలో తమ చివరి మ్యాచును పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ కీలకమైన మ్యాచ్‌కు కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. కేన్ గైర్హాజరీలో ఆరెంజ్ ఆర్మీని ముందుండి నడిపించేది ఎవరు..? (PIC.Instagram)
ఫాఫ్ డుప్లెసిస్ లేని సమయంలో మార్క్రామ్ దక్షిణాఫ్రికా సీనియర్ జట్టుకు నాయకత్వం వహించాడు. 2018లో భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌కు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు. వన్డే మ్యాచ్‌లో సీనియర్ జట్టుకు సారథ్యం వహించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన రెండో క్రికెటర్. అతను 23 సంవత్సరాల 123 రోజుల వయస్సులో తన మొదటి కెప్టెన్సీని చేశాడు. దీంతో.. మార్క్రామ్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. (PIC.Instagram)