ఇక, ఈ సీజన్ లో ఇప్పటి వరకు కూడా పొలార్డ్ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. చాలా మ్యాచుల్లో కూడా తన జిడ్డు బ్యాటింగ్ తో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచుల్లో కేవలం 144 పరుగులు మాత్రమే చేశాడు పొలార్డ్. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. యావరేజ్ 14.40 . స్ట్రైక్ రేట్ అయితే 106. ఒకప్పుడు 200కి స్టైక్ రేట్ తో బాదే పొలార్డ్ ని చూస్తే జాలేస్తేంది.
తన చెత్తాటతో జట్టుకు భారంగా మారుతున్నాడు. జట్టులో డేవాల్డ్ బ్రెవిస్ వంటి టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నాడు. పొలార్డ్ ను తప్పించి బ్రెవిస్ ను తుది జట్టులో ఆడించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పొలార్డ్ కు టాటా చెప్పే సమయం ఆసన్నమైందని.. అతని స్థానంలో బ్రెవిస్ ఆడించాలని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా డిమాండ్ చేస్తున్నాడు.