బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ ఈ విషయంపై కోహ్లీతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో పాటు ఐర్లాండ్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే ముందు విరాట్ కోహ్లీని సంప్రదిస్తామని సెలక్షన్ కమిటీలోని సభ్యుడు ఒకరు తెలిపారు. ఫోన్లో మాట్లాడటమో.. లేదా ఛాట్ ద్వారా అతని అభిప్రాయాన్ని సేకరిస్తామని పేర్కొన్నారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కోహ్లీపై నిర్ణయం తీసుకుంటామని సెలెక్షన్ కమిటీ సభ్యుడు వ్యాఖ్యానించడం ఇప్పుడు అనేక చర్చలకు తావిస్తోంది.