ఇలాంటి చెత్త ప్రదర్శనలోనూ కోహ్లీని మాత్రం రికార్డులు వదలడం లేదు. ఆర్సీబీ మాజీ సారథి కోహ్లీ భారత ఐపీఎల్ లో అరుదైన ఘనత సాధించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్పీత్‌బ్రార్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే సింగిల్ తీసిన అతడు.. ఈ టీ20 లీగ్‌లో 6500 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. దీంతో ఈ రికార్డు నెలకొల్పిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
ఇక ఈ సీజన్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న అతడు ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసిన కోహ్లీ 3.2 ఓవర్‌కు రబాడ బౌలింగ్‌లో రాహుల్ చాహర్ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో అతడి నుంచి మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.