ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ ఫ్యాన్స్ కు కావాల్సిన బోలెడంత మజా అందిస్తోంది. ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుండటంతో ఫ్యాన్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటివరుకు 18 మ్యాచులు జరిగియ్. ఇక, శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. 4 మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు ఇది మూడో విజయం. దీంతో, పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో నిలిచింది.
అయితే, ఈ మ్యాచ్ లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ. ఐపీఎల్లో 550 ఫోర్లు విరాట్ ఖాతాలో చేరాయ్. టీ20 లీగ్‌లో 550 ఫోర్లు, 200కి పైగా సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. విరాట్ 211 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 554 ఫోర్లు, 212 సిక్సర్లు కొట్టాడు. ఇందులో 5 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. (RCB Instagram)