ఇండియన్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఇద్దరూ ఇద్దరే. ఒంటి చేత్తో విజయాలను అందించడంలో వీరికి వీరే సాటి. గతంలో టీమిండియా (Team India)ను విరాట్ కోహ్లీ నడిపిస్తే... ఇప్పుడు రోహిత్ శర్మ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం కాస్త కష్టమే అవుతుంది.
కోహ్లీ, రోహిత్ సెంచరీల్లో పోటీ పడాల్సిన ఆటగాళ్లు.. ఇలా డకౌట్ల విషయంలో పోటీపడుతుంటే ఫ్యాన్స్ బాధపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ లో కీలకం కావాల్సిన ఈ టీమిండియా పిల్లర్స్ ఇప్పుడు భారంగా మారుతున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఇలాగే ప్రదర్శన చేస్తే టీమిండియా మెగాటోర్నీలో రాణించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.