భారతదేశంలో అత్యంత క్రేజ్ ఉన్నవి రెండే. అందులో ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. ఇక, క్రికెట్ కు ఉన్న పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా హీరోల కన్నా.. టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి క్రికెట్, సినిమాకు ఏదో తెలియని సంబంధం ఉంది. అవును.. ఎందరో క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా ఉన్నారు.
[caption id="attachment_1278202" align="alignnone" width="497"] క్రికెటర్లకు సినీ తారల మధ్య డేటింగ్స్, అఫైర్ల విషయం కొత్తేమీ కాదు. అయితే లేటెస్ట్ గా టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ (Mumbai Indians) సారథి రోహిత్ శర్మ, బిగ్‌బాస్ ఫేమ్, లండన్ బ్యూటీ సోఫియా హయత్ అఫైర్ మరోసారి మీడియాలో వైరల్‌గా మారింది.
[caption id="attachment_1278210" align="alignnone" width="1600"] లండన్ లో పుట్టిన సోఫియా.. నటన మీద మక్కువతో ఇండియాకు వచ్చింది. అనతి కాలంలోనే బాలీవుడ్ లో మంచి పాపులారిటీని సాధించింది. గాయనిగా, నటిగా, టెలివిజన్ పర్సనాలిటీగా తన టాలెంట్‌ను రుజువు చేసుకుంది. అయితే తన ప్రతిభ కంటే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతోనే అత్యంత పాపులారిటీ సంపాదించింది. నటిగా, సింగర్‌గా అంతగా పేరు సంపాదించలేని సోఫియా హయత్ హిందీ బిగ్‌బాస్‌లో కనిపించిన తర్వాతే ఆమెకు మరింత పాపులారిటీ క్రేజ్ సంపాదించుకొన్నారు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ 7లో సోఫియా అదరగొట్టేసింది. 2013 నుంచి టాప్ సెలబ్రిటీగా అందర్ని ఆకర్షించింది.
[caption id="attachment_1278214" align="alignnone" width="598"] ఇలాంటి నేపథ్యం ఉన్న సోఫియా హయత్, క్రికెటర్ రోహిత్ శర్మ మధ్య 2012లో ప్రేమాయణం నడిచింది. అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ కూడా. వీరిద్దరి ఫోటోలు, అతి సన్నిహితంగా ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలోను, మీడియాలోను వైరల్ అయ్యాయి. అయితే వారిద్దరి ప్రేమ వ్యవహారం ఎంత వేగంగా ముందుకు కదిలిందో.. అంతే వేగంగా కూడా బ్రేకప్ జరిగింది.
[caption id="attachment_1278216" align="alignnone" width="578"] అయితే రోహిత్ శర్మ, సోఫియా హయత్ ప్రేమ వ్యవహారం విఫలం కావడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లి అన్న టాక్ కూడా ఇంది. రోహిత్‌తో వ్యవహారం కొనసాగుతున్న సమయంలోనే సోఫియాతో కోహ్లి రిలేషన్ పెట్టుకొన్నారు. ఆ కారణంగానే సోఫియాకు రోహిత్ బ్రేకప్ చెప్పాడు. సోఫియాతో బ్రేకప్ కారణం విరాట్ కోహ్లీ అనే విషయం మీడియాలో హైలెట్ అయింది.
[caption id="attachment_1278220" align="alignnone" width="1200"] అయితే ఒక ఇంటర్వ్యూలో సోఫియా మాట్లాడుతూ తన గురించి మీడియా ఎప్పుడు అడిగినా ’సోఫియా నా ఫ్యాన్‘ అనే రోహిత్ చెప్పాడని.. తమ లవ్ గురించి చెప్పలేని వాడితో తనకు ప్రేమేంటనే ఉద్దేశంతో రోహిత్ కు బ్రేకప్ చెప్పినట్లు ఆమె పేర్కొనడం విశేషం