క్రికెట్ పండుగ ఐపీఎల్ 2022కి కౌంట్ డౌన్ షూరూ అయింది. మరో మూడు రోజుల్లో ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది ధనాధన్ లీగ్. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై, కోల్ కతా (CSK vs KKR)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక, ఐపీఎల్ లో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డులు ఉన్నాయ్.
ముంబై ఇండియన్స్ తరఫున 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను సాధించి రికార్డు సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల పరంగా కాస్త వెనుకబడ్డాడు. ఐపీఎల్ లో ఒక్క సీజన్ లో కూడా 600 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయాడు. అంటే పరుగులు సాధించడంలో కోహ్లీ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. 2013లో రోహిత్ అత్యధికంగా 538 పరుగులు చేశాడు.