క్రికెట్ (Cricket) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ 2022కి (IPL 2022) సంబంధించిన ప్లేయర్స్ రిటెన్షన్స్ (Player Retentions) పూర్తైంది. అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షల్లపై తీవ్రమైన కసరత్తు చేసినట్లే కనబడింది. సీనియర్ ప్లేయర్లకే దాదాపు ఫ్రాంచైజీలన్నీ పెద్దపీఠ వేశాయి. అదే సమయంలో కొంత మంది యువ ప్లేయర్లు, అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా లక్కీ చాన్స్ కొట్టేశారు. ఐపీఎల్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను వారి ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోగా.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ వార్నర్, రషీధ్ ఖాన్ , శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లతో పాటు కీలక ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి.
అలాగే, సుదీర్ఘ కాలంగా తమ విజయాల్లో భాగంగా ఉన్న కొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు నమ్మకం పెట్టుకోగా, మరికొందరిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనసాగించేందుకు సిద్ధపడ్డాయి. ఇక లీగ్‌లోకి కొత్తగా వచ్చిన రెండు జట్లు రిటైన్ కానీ ఆటగాళ్ల జాబితా నుంచి ముగ్గురేసి ఆటగాళ్లను 'పికప్ ఆప్షన్'కింద ఎంచుకోనున్నాయ్.
భారీ ఆఫర్లిస్తూ తమ జట్టు తరఫున ఆడేలా ఒప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB).. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. రిటెన్షన్ ప్రక్రియలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్‌లను రిటైన్ చేసుకుంది.
దీంతో ఆసీస్ కే చెందిన మ్యాక్స్‌వెల్‌తో డేవిడ్ వార్నర్ కోసం మార్క్ స్కెచ్ వేసింది. గత సీజన్లో మ్యాక్సీ కోసం ఆడమ్ జంపాను ఎలా వాడుకుందో.. ఇప్పుడు మ్యాక్సీతో వార్నర్‌ను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. డేవిడ్ వార్నర్‌ను జట్టులోకి తీసుకుంటే టాపార్డర్ బలమవడంతో పాటు కెప్టెన్సీ ఆప్షన్ కూడా లభిస్తుందని మైక్ హెస్సెన్ నేతృత్వంలోని ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తోంది.
అయితే ఎప్పుడూ ఇలా కామెంట్ చేయని విరాట్ కోహ్లీ.. డేవిడ్ వార్నర్ వీడియోకు స్పందించడంతో అభిమానులు కొత్త చర్చకు తెరలేపారు. గతంలో మ్యాక్స్‌వెల్ విషయంలో కూడా కోహ్లీ ఇలానే హింట్ ఇచ్చాడని గుర్తు చేశారు. ఇక డేవిడ్ వార్నర్ కోసమే యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌ను రిటైన్ చేసుకోలేదని చెబుతున్నారు. ఏదీ ఏమైనా వార్నర్ జట్టులో చేరితే ఆర్సీబీ బలం ఆమాంతం పెరగనుంది.
వాస్తవానికి 2023 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ.. ఆ క్రమంలోనే తనపై నెలకొన్న పనిభారాన్ని తగ్గించుకునేందుకు ఆర్సీబీ కెప్టెన్సీతో పాటు టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. కానీ బీసీసీఐ మాత్రం వైట్ బాల్ క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేసింది.