ఐపీఎల్ 2022(IPL 2022) సీజన్ కోసం క్రికెట్ ప్రియులు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. బీసీసీఐ (BCCI) కూడా ఐపీఎల్ 15వ ఎడిషన్‌ను త్వరగా స్టార్ట్ చేయాలని వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇక మెగావేలం (IPL Mega Auction) 12, 13 తేదీల్లో బెంగళూరులో నిర్వహించనుంది బీసీసీఐ. ఇక, వచ్చే ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ కూడా బరిలో దిగుతున్నాయ్.
ఈ క్రమంలోనే లక్నో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్, రవి బిష్ణోయ్‌లను తీసుకుందని కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌ల పేర్లు పెద్దగా వినిపించలేదు. అయితే ఈఎస్పీఎన్ మాత్రం లక్నో డ్రాఫ్ట్ ఇదేనంటూ ముగ్గురి జాబితాను ప్రకటించింది.
అత్యధిక ధరకు లక్నో ఫ్రాంచైజీని దక్కించుకున్న ఆర్పీఎస్జీ గోయెంకా గ్రూప్.. అప్‌కమింగ్ సీజన్ కోసం అన్ని విధాలుగా సమాయత్తం అవుతోంది. ఇప్పటికే జట్టు హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్, బ్యాటింగ్ కోచ్‌గా విజయ్ దహియాను నియమించిన లక్నో టీమ్.. మెంటార్‌గా గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేసింది.